కనిపించని సీసీరోడ్లు, డ్రైనేజీలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:26 PM
పట్టణంలోని 10వ వార్డులోని అయోధ్యనగర్ కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఆరేళ్లుగా పట్టించుకోని అధికారులు
- ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని 10వ వార్డులోని అయోధ్యనగర్ కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం చేపట్టాలని అప్పటి పాలకవర్గాన్ని, అధికారులకు కాలనీవాసులు పలు సార్లు విన్నవించినా.. నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో కాలనీల్లో ఇళ్లలోని నీరు డ్రైనేజీలు లేక రోడ్డుపైనే పారుతోంది. ప్రస్తుతం వర్షకాలం కావడంతో ఇళ్లలోని వృథా నీటితో పాటు వర్షపు నీరు తోడుకావడంతో రోజుల తరబడి బురదమయంగా ఉంటుంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.