వివక్ష, అసమానతలను రూపుమాపుదాం
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:02 PM
సమా జంలో అక్కడక్కడా కొనసాగుతున్న కుల వివక్ష, అసమానతల ను రూపుమాపుదా మని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి టౌన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సమా జంలో అక్కడక్కడా కొనసాగుతున్న కుల వివక్ష, అసమానతల ను రూపుమాపుదా మని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కొత్తగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిట రింగ్ కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కేం ద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మే ఘారెడ్డిని కలిశారు. కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ.. తమకు వచ్చిన అవకాశంతో.. పేద ప్రజల కు ఉపయోగపడేలా కమిటీ సభ్యులు కృషి చే యాలన్నారు. చట్టపరమైన అంశాలను ప్రజల కు తెలియజేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీ సుకురావాలన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చే స్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంక టేష్, వెంకట్‌గౌడ్, మాదారి భోజరాజు, జీ.వెంక టేష్, ఎడవల్లి వీరప్ప, చిన్నమ్మ థామస్, ఖమ ర్ రెహమాన్, ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ కో ఆర్డి నేటర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.