అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:20 PM
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు న్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు.
- జల్సాలకు అలవాటుపడి చోరీలు
- ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ
- రూ. 1.20 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, సెల్‌ఫోన్లు, బైకులు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ
గద్వాల క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు న్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. శనివారం గద్వాల పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరా లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లోని మద్దెలబండ, గద్వాల మండలంలోని జమ్మిచేడు, కేటీ దొడ్డిలోని చింతలకుంట, ధరూర్ మండలంలోని మార్గబీడు గ్రామాల్లో ఐదు దొంగతనాలు జరి గాయి. ఈ చోరీలకు పాల్పడిన వారిని పట్టుకు నేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. శనివారం మల్దకల్ మండల కేంద్రంలో వాహనాలు తనఖీ చేస్తుండగా గద్వాల వైపు నుంచి మల్దకల్ వైపునకు వస్తున్న ముగ్గురు అనుమానంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఐదు దొంగతనాల లో ఈ ముగ్గురితో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగతనం చేసిన వారిలో కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లాకు చెందిన కుర్వ గిరీశ్, చంద్రశేఖర్, కేటీ దొడ్డి మండలం చింతలకుంటకు చెందిన కుర్వ చిన్నవెంకన్న, ప్రాణేశ్‌లు ఉన్నట్లు గు ర్తించారు. చంద్రశేఖర్ పరారీ లో ఉండగా ఈ ముగ్గురి నుం చి ఐదున్నర తులాల బంగా రం, రూ.1.20 లక్షల నగుదు, రెండు బైకులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 90శాతం రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు చేదించి న సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ టీ.శ్రీను, మల్దకల్ ఎస్‌ఐ నందికర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.