Share News

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:32 PM

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎన్‌.లింగయ్య తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

మక్తల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎన్‌.లింగయ్య తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రి వేళల్లో ము గ్గురు వ్యక్తులు దొంగతనం చేసి ఇతర రాష్టాల్లో తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారన్నారు. శుక్రవారం సీఐ రాంలాల్‌, ఎస్‌ ఐ భాగ్యలక్ష్మీరెడ్డిలు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ శివారులో అనుమా నాస్పదంగా బైక్‌ దొంగిలిస్తున్న వ్యక్తులు కోరం ఎల్లప్ప(ఖైరతాబాద్‌), స్వర్ణ దుర్గప్ప అలియాస్‌ దుర్గేష్‌(హైదరాబాద్‌), శంశొద్దీన్‌(బసవేశ్వరనగర్‌, షోలా పూర్‌ బైక్‌ మెకానిక్‌)లు మక్తల్‌, యాదగిరి, కర్నాటక ప్రాంతాల్లో బైక్‌లను చో రీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మక్తల్‌, మరికల్‌, క్రిష్ణ, హైదరా బాద్‌లో పలు బైక్‌లు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి 5షైన్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.4లక్షలు ఉంటుందన్నారు. నిందితునలను అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ రాంలాల్‌, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి, నవీద్‌, ఏఎస్సై శంకరయ్య, కానిస్టేబుల్‌ అశోక్‌, శ్రీకాంత్‌, శశిధర్‌, బరత్‌లను అభినందించారు. త్వరలో రివార్డు ఇస్తామన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:32 PM