అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:03 PM
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న అంత ర్రాష్ట్ర ముఠా సభ్యులు పది మందిని చాకచక్యం గా నారాయణపేట జిల్లా పోలీసులు పట్టుకు న్నారు.
- 12.4 కిలోల నిషేధిత గంజాయి పట్టివేత
- పదిమంది, రెండు బైకులు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం
- సోలాపూర్ నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందం
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్
నారాయణపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న అంత ర్రాష్ట్ర ముఠా సభ్యులు పది మందిని చాకచక్యం గా నారాయణపేట జిల్లా పోలీసులు పట్టుకు న్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఎస్పీ వినీత్ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని కృష్ణ ఎస్‌ఐ నవీద్ తన సిబ్బందితో అదివారం సాయంత్రం కూన్సి చెక్‌పోస్టు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు బైకుల పై అనుమానాస్పదంగా ఐదుగురు వ్యక్తులు పా రిపోవడానికి ప్రయత్నించారన్నారు. దీంతో వారి ని వెంబడించి అదుపులోకి తీసుకొని విచారించ గా నారాయణపేటకు చెందిన ముగ్గురు యువ కులు అజర్ అలీ, సుఫియాన్, కనిగిరి విశాల్ ఉన్నారు. వారు వచ్చిన హోండా షైన్ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వా రు గతంలో నారాయణపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్ల అమ్మకానికి ప్రయత్నించార న్నారు. కర్ణాటకలోని యాదిగిరికి చెందిన ఉమే ష్, లల్లన్‌రామ్ కూడా తమ బైక్ పై వచ్చి సై దాపూర్ వద్ద కలుసుకున్నారన్నారు. ఇక్కడ యాదగిరికి చెందిన సోనియా అనే మహిళ వ ద్ద సుమారు రెండు కిలోల గంజాయి తీసుకు న్నారన్నారు. వారి తిరిగి వస్తుండగా కున్సి చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారని తెలిపారు. సోనియా విచారణలో గంజాయిని నారాయణపేట యువకులు పంపించినట్లు వె ల్లడించిందని, రెండు బైకులు, 2.15 కేజీల గం జాయి, పదివేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అనంతరం నిందితుల స మాచారం మేరకు ముంబై నుంచి వస్త్తున్న ఉ ద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్దమొత్తంలో గంజా యి వస్తుందని తెలిసి కృష్ణా రైల్వే స్టేషన్‌లో ఎస్‌ఐ నవీద్ బృందం మాటు వేసి అదివారం రాత్రి 7.45 గంటలకు మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన తుకారం, సమీర్, ఏక్‌నాధ్, అక్షయ, ద త్తత్రేయ, యాదిగిర్‌కు చెందిన సోనియా, సమీ ర్ సయ్యద్‌లను పట్టుకొని పదికిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోలా పూర్‌కు చెందిన నితిన్ అనే వ్యక్తి ఈ గంజాయి అందజేశారన్నారు. ప్రస్తుతం నితీన్ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పో లీసు బృందాన్ని నియమించినట్లు తెలిపారు. రెండేళ్లుగా అంత ర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గంజాయి ప్యాకెట్లు అక్ర మంగా రవాణా చేస్తున్న మొత్తం పది మందిని అరెస్టు చేసి వారి నుంచి 12.4 కేజీల గంజాయి, రెండు బైకులు, పది సెల్‌ఫోన్లు, పదివేల నగ దు, స్వాధీనం చేసుకొని కృష్ణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందుతులను సోమవారం రిమాండ్‌కు పంపించా మన్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రామ్‌లాల్, కృష్ణ ఎస్‌ఐ నవీద్, టస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది గోప్యానాయక్, రాఘవేందర్‌గౌడ్, రామస్వామి, అశోక్ కుమార్, శ్రీకాంత్, అశోక్, బానుప్రసాద్, శంకరమ్మలను ఎస్పీ అభినం దించారు.