అంతర్రాష్ట్ర పశువుల దొంగలు అరెస్టు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:33 PM
క్యాటరింగ్ పనిలో వచ్చే డబ్బుతో సంతృప్తి చెందని వారు పశువుల దొంగలుగా మారారు.
- పట్టుకున్న నవాబ్‌పేట పోలీసులకు రివార్డులు
- మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి ధరావాత్
నవాబ్‌పేట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : క్యాటరింగ్ పనిలో వచ్చే డబ్బుతో సంతృప్తి చెందని వారు పశువుల దొంగలుగా మారారు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి ధరావత్ గురువారం నవాబ్‌పేట పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెవ్లడించారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహ బూబ్‌నగర్ జిల్లా, మహ్మదాబాద్ మండలం జూలపల్లికి చెందిన కుమ్మరి అశోక్, నల్గొండ జిల్లా నూతకల్ మండలం ముకుందాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి సాయికుమార్, కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలంలోని బొబ్బకల్ గ్రామానికి చెందిన సర్దస్ అఖీల్, వరంగల్ జిల్లా, జనగాం మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బుర్క సాయి క్యాటరింగ్ పని చేస్తూ జీవనం గడిపేవారు. ఈ పనిలో వచ్చే డబ్బు వారికి సంతృప్తిని ఇవ్వకపోవడం, అధికంగా సంపాదించాలన్న ఆలోచనతో పశువుల దొంగతనాలు మొదలు పెట్టారు. యాదగిరి గుట్ట, యాలాల్, సైబరాబాద్, వికారాబాద్, కుల్కచెర్ల, నవాబ్‌పేట తదితర పాంతాల్లో వ్యాన్‌లో తిరుగుతూ, 16 పశువులను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలంలోని మరికల్ గ్రామానికి చెందిన అంబటి రాములు తన పశు వులు పోయాయని సెప్టెంబరు 2న నవాబ్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ విక్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా గురువారం ఉదయం కన్మన్‌కాల్వ శివారులో తనిఖీలు చేస్తున్న పోలీసులకు పశువులతో వెళ్తున్న వ్యాన్ కనిపించింది. దాని ఆపి, నలుగురు నిందితులను అ దుపులోకి తీసుకొని విచారించారు. తాము 9 పశువులు, 6 లేగ దూడలు, ఒక గేదెను అపహరించినట్లు వారు అంగీకరించారు. వారు దొంగిలించిన పశువుల విలువ 14.50 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 9 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అ భినందించి, రివార్డులు అందించారు. సమావే శంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, నవాబ్‌పేట ఎస్‌ఐ విక్రం, సిబ్బంది జనార్దన్, వెంకట్రాములు, సురేశ్‌బాబు, భాస్కర్, శెట్టినాయక్ పాల్గొన్నారు.