యూరియా కొరత లేకుండా తనిఖీలు ముమ్మరం
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:23 PM
జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించా రు.
అధికారుల సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించా రు. గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన స మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో యూరియా, డీఏపీ, పొటాష్, కంప్లెక్స్ వంటి అ వసరమైన ఎరువులు రైతులకు ఎలాంటి అసౌ కర్యం కలుగకుండా సమయానికి ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ అవసరాలకు మించకుండా యూరియా కొనుగోలు చేసే విధంగా చూడాలని, కేవలం పంటలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. మండల వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా సందర్శించి యూరియా స్టాక్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. సహాయ వ్యవసాయ అధికారులు ఎరువుల నిల్వల లభ్యతను ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయశాఖాధికారులు రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండి వారికి అవ సరమైన సలహాలు, సూచనలు అందజేస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ జిల్లా అధికారి సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, అధికారులు ఉన్నారు.