గాడిదలవాగు-ఊట్కూర్ రోడ్డు పరిశీలన
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:00 PM
మండలంలోని పెద్దపొర్ల గ్రామం నుంచి గాడిదలవాగు మీదుగా ఊట్కూర్‌కు రైతులు స్వచ్చందంగా వేసుకున్న రోడ్డును బుధవారం పంచాయతీరాజ్ డీఈ కళ్యాణరెడ్డి, ఏఈ అజయ్‌రెడ్డి పరిశీలించారు.
ఊట్కూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దపొర్ల గ్రామం నుంచి గాడిదలవాగు మీదుగా ఊట్కూర్‌కు రైతులు స్వచ్చందంగా వేసుకున్న రోడ్డును బుధవారం పంచాయతీరాజ్ డీఈ కళ్యాణరెడ్డి, ఏఈ అజయ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. రోడ్డుకు మధ్యలో వస్తున్న మూడు వాగులపై పైపులు వేసి కల్వర్టుల నిర్మాణం చేయాలని రైతులు అధికారులను కోరారు. ఊట్కూర్ వరకు రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అం చనా కోసం రోడ్డు, కల్వర్టుల కొలతలు తీసుకున్నారు. గ్రామ రైతులు కొల్లూర్ శంకరప్ప, కొల్లూర్ భీంషప్ప, కొల్లూర్ జయప్ప, కొల్లూర్ శివ, కొల్లూర్ అంజప్ప, గుర్రల చిన్ననర్సిములు, అంజప్ప, అయ్యప్ప, గుర్రాల హన్మంతు ఉన్నారు.