ర్యాలంపాడు పునరావాస కేంద్రం పరిశీలన
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:04 AM
మండల పరిధిలోని ర్యాలంపాడు నూతన పున రావాస కేంద్రాన్ని ఆదివారం వనపర్తి డివిజన్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ధరూర్ మండల వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
చీఫ్ ఇంజనీర్‌కు సమస్యలను ఏకరువు పెట్టిన గ్రామస్థులు
ధరూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ర్యాలంపాడు నూతన పున రావాస కేంద్రాన్ని ఆదివారం వనపర్తి డివిజన్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ధరూర్ మండల వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడిన వన పర్తి డివిజన్ చీఫ్ ఇంజనీర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలని, రోడ్డు, నీరు, డ్రైనేజీ, క రెంట్ ఇతర సమస్యలు ఉన్నాయని గ్రామస్థులు చీఫ్ ఇంజనీర్‌కు వివరించారు. అనంతరం గ్రా మస్థులు చీఫ్ ఇంజనీర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రహిముద్దీన్, గ్రామ మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నిర్వాసిత కమిటీ సభ్యులు ఉన్నారు.