రైస్‌మిల్లుల తనిఖీ
ABN , Publish Date - May 01 , 2025 | 11:24 PM
కోస్గి పట్టణంలోని పలు రైస్‌మిల్లులను జిల్లా సివిల్ సఫ్లై అధికారి బాలరాజు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
కోస్గి, మే 1 (ఆంధ్రజ్యోతి): కోస్గి పట్టణంలోని పలు రైస్‌మిల్లులను జిల్లా సివిల్ సఫ్లై అధికారి బాలరాజు గురువారం ఆకస్మిక త నిఖీ చేశారు. పట్టణంలోని ధనలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేసి, వడ్ల కొనుగోలు ఎలా చేస్తున్నారని, మిల్లులో వర్కింగ్ ఎలా ఉందని తదితర విషయాలపై ఆయన ఆరా తీశారు. డీఎం సైదులు, డీటీ ఆనంద్‌తో పాటు రైస్ మిల్లుల యజమానులు శ్రీరాములు, రఘురాములు, సంతోష్ ఉన్నారు.