మెప్మా వరి కొనుగోలు కేంద్రం పరిశీలన
ABN , Publish Date - May 12 , 2025 | 11:01 PM
నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మెప్మా కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తనిఖీ చేశారు.
నారాయణపేట, మే 12 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మెప్మా కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కుప్పలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కొనుగోలు పత్రాలు, రిజిస్టర్‌లను సరి చూశారు. కేంద్రం ని ర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ఇప్పటివరకు 66,600 గన్నీ బ్యాగులు రైతులకు పంపిణీ చేయగా 19,440 క్విం టాళ్లు కొనుగోలు చేశామని, 532 మంది రైతులు ధాన్యం విక్రయించారని మెప్మా సిబ్బంది ఇన్‌చార్జి సాయికుమారి వివరించారు. అదనపు కలెక్టర్ వెంట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మార్కెటింగ్ అధికారి బాలమణి, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్ లక్ష్మణ్ తదితరులున్నారు.