Share News

ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలన

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:07 PM

గుండుమాల్‌ మండల పరిధిలోని అమినికుంట గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లకు ఎంపి కైన లబ్ధిదారుల ఇంటి స్థలాల వివరాలను ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు.

ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలన
ధన్వాడలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

కోస్గి రూరల్‌/ధన్వాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : గుండుమాల్‌ మండల పరిధిలోని అమినికుంట గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లకు ఎంపి కైన లబ్ధిదారుల ఇంటి స్థలాల వివరాలను ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇంటి పత్రాలను అందించారు. వీరికి త్వరలో ఇంటి నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేసి పనులను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, ఇందిరమ్మ పథకం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అదేవిధంగా, ధన్వాడలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే రెండురోజుల నుంచి కొనసాగుతోంది. ప్రతీ వార్డులో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఎంపీఈవో వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రావు, పంచాయతీ సిబ్బంది బాలకృష్ణ, భాను తదితరులు సర్వేలో పాల్గొంటున్నారు.

అర్హులకు కేటాయించాలి

ధన్వాడ : మండల కేంద్రంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని బీఎస్పీ నాయకుడు గుర్రం రాజు కోరారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిందేనన్నారు. మొదటి, రెండవ విడత అంటు జనాలను తప్పదోవ పట్టిస్తే ఆందోళన చేస్తామంటు హెచ్చరించారు.

Updated Date - Apr 29 , 2025 | 11:07 PM