Share News

ఎన్నికల్లో లబ్ధికోసమే ఇందిరమ్మ చీరలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:28 PM

వచ్చే గ్రామ పంచాయతి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఎన్నికల్లో లబ్ధికోసమే ఇందిరమ్మ చీరలు
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ

రెండేళ్లకు ఇందిరమ్మ గుర్తుకు వచ్చిందా?

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ఉండాల్సిందే

అభివృద్ధి కేంద్రం నిధులతోనే.. రాష్ట్రం దివాళా తీసింది

విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ

నారాయణపేట న్యూ టౌన్‌, నవంబరు24, (ఆంధ్రజ్యోతి): వచ్చే గ్రామ పంచాయతి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తరువాత ఇందిరమ్మ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల పదవి కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించేదన్నారు. రాష్ట్రం దివాలా తీయడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధుల కోసం ఎన్నికలకు ముందుకెళ్తోందన్నారు. హామీలన్నీ తుంగలోతొక్కి, ఎన్నికల్లో గెలువాలనే తపనతో పథకాల పేరుతో తాయిలాలు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోనే ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు నాగురావు నామాజీ, కె.రతంగ్‌పాండురెడ్డి, బి.కొండయ్య, జిల్లా అధ్యక్షుడు కె.సత్యయాదవ్‌, ప్రధాన కార్యదర్శులు తిరుపతిరెడ్డి, లక్ష్మీశ్యాంసుందర్‌ గౌడ్‌, బలరాంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:28 PM