Share News

ఇందిరమ్మ ఇంటిని త్వరగా నిర్మించుకోవాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:23 PM

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదా రులు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

ఇందిరమ్మ ఇంటిని త్వరగా నిర్మించుకోవాలి
ఇబ్రహీంబాద్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ విజయేందిర బోయి

హన్వాడ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదా రులు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని ఇబ్రహీం బాద్‌ గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బేస్మెంట్‌ పూర్తి చేసిన లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి.. ఎన్ని చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం జరుగుతున్నదని, నీవు ఏమి చదువుకున్నావని అడిగారు. ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది.. ఉచి తంగా వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంబాద్‌ గ్రామా నికి 91 ఇళ్లు మంజూరీ కాగా ఇప్పటికీ 6 బేస్మెంట్లు పూర్తి కాగా, 56 మార్కింగ్‌ చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు. అంతకు ముం దు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్‌ ఇంటిని పరిశీలిం చారు. మొదట దాచకపల్లిలో కలెక్టర్‌ పర్యటించారు. 1988లో కట్టిన ఇ ళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని చెంచులు కలెక్టర్‌కు వివరించగా, పరి శీలించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు తెలిపారు. అనంతరం హన్వాడలో అగ్రో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాక్‌ ను పరిశీలించారు. ఆమె వెంట గృహ నిర్మాణశాఖ పీడీ భాస్కర్‌, తహసీ ల్దార్‌ కిష్ట్యానాయక్‌, ఎంపీడీవో యాశోద, ఏవో కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:23 PM