అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:12 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేయడమే లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ప్రొసిడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాలన్యూటౌన్, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేయడమే లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇంది రమ్మ ఇళ్ల మంజూరులో అర్హులైన వారికి ప్రొసిడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,400 ఇళ్లు మంజూరయ్యాయని, ఇం దులో 138 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్, నాయకులు కురుమన్న ఉన్నారు.