నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - May 28 , 2025 | 11:35 PM
ప్రభుత్వ నిబంధనల ప్రకా రం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు.
తిమ్మాజిపేట, మే 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనల ప్రకా రం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఇప్పలపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటి యాజమాని రేణుక, ఇంటిని నిర్మిస్తున్న మేస్త్రీతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మా ణాలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ గృహ ని ర్మాణాలు వేగంగా పూర్తి చేసి జూన్ 2నాటికి ఇంటిని ప్రారంభించు కునేలా చూడాలన్నారు. అదే గ్రామంలోని అంగన్‌వాడీ భవన నిర్మా ణాన్ని పరిశీలించారు. అనంతరం మరికల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సంగప్ప, తహసీల్దార్ రామకృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మీదేవమ్మ, వ్యవసాయ అధికారి కమల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.