అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:07 PM
అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్/మక్తల్ రూరల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్ధేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడు తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తి పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రూ.175 కోట్లతో 3500ల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరో వంద కోట్లతో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. సమా వేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, మండల అధ్యక్షుడు గణేశ్‌కుమార్, నాయకులు కట్టసురేష్‌కు మార్‌గుప్తా, కట్ట వెంకటేష్, మ్యాదరి శ్రీనివాసులు, కావలి ఆంజనేయులు తదితరులున్నారు. అనంతరం ఆయన పట్టణంలోని పరిషత్ కా ర్యాలయ ఆవరణలో సాయంత్రం నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ప్రజలందరికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్‌ఈ శ్రీధర్‌కు సూచించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. పరిష్కార మార్గాలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానన్నారు. ఈఈ ఉదయ్‌శంకర్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన మక్తల్ మండలం భగవాన్‌పల్లి గ్రామంలో బొడ్రాయి, నవగ్రహా ప్రతిష్ఠాపన పూజలో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, నాయకులు ఉన్నారు.