Share News

సమర్థపాలన అందించిన ఇందిరాగాంధీ

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:32 PM

దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి సుస్థిర, సమర్థపాలన అందించారని కాంగ్రెస్‌ శ్రేణులు కొనియాడారు.

సమర్థపాలన అందించిన ఇందిరాగాంధీ
గద్వాల పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

  • జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు

  • కాంగ్రెస్‌ శ్రేణుల నివాళి

గద్వాల టౌన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి సుస్థిర, సమర్థపాలన అందించారని కాంగ్రెస్‌ శ్రేణులు కొనియాడారు. బుధవారం ఆమె జ యంతిని పురస్కరించుకుని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివా ళి అర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచంలోని అగ్రదేశాల తాకి డిని తట్టుకుని భారత్‌ను సముచిత స్థానంలో నిలిపిన ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా ప్రపంచ ఖ్యాతి పొందారని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్‌ కీర్తించారు. గద్వాలలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ క మిటీ మాజీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, మాజీ కౌన్సి లర్లు పులిపాటి వెంకటేష్‌, ఎల్లప్ప, భాస్కర్‌యా దవ్‌, నాయకులు షఫి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఆనంద్‌, కౌసర్‌బేగ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్‌, లక్ష్మన్న, ఆనంద్‌ గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:32 PM