Share News

ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ ఘన విజయం

ABN , Publish Date - May 06 , 2025 | 11:38 PM

మహబూబ్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది.

ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ ఘన విజయం

- అధ్యక్షుడిగా నరేంద్రచారి, ప్రఽధాన కార్యదర్శిగా జి. నరేందర్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది. సుదీర్ఘకాలంగా ప్రెస్‌ క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించపోవడం వల్ల ఇంతకాలం ప్రెస్‌క్లబ్‌ నిర్వహణ లేకుండా పోయింది. మంగళవారం పోలింగ్‌ నిర్వహించగా మొత్తం 252 ఓట్లుకు గాను 245 ఓట్లు పోలయ్యాయి. ఒక్క జాయింట్‌ సెక్రటరీ పోస్టులో టీడబ్ల్యూజేఎఫ్‌ గెలుపొందగా మిగతా పాలకవర్గంలోని అన్ని పోస్టులను ఇండిపెండెంట్‌ ప్యానల్‌ కైవసం చేసుకున్నది. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా హెచ్‌ఎం టీవీ కరస్పాండెంట్‌ నరేంద్రచారి విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రజ్యోతి జిల్లా ఇన్‌చార్జి జి. నరేందర్‌ గౌడ్‌, కోశాధికారిగా సాక్షి విలేకరి యాదయ్య విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా అంజిలయ్య, అక్కల ధరణి కాంత్‌, చింతకాయల వెంకటేష్‌ విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీలుగా మణిప్రసాద్‌, సతీష్‌ కుమార్‌, జి. కృష్ణ విజయం సాధించారు. ఈసీ మెంబర్లుగా అబ్దుల్‌ అహద్‌ సిద్ధిఖీ, రాంకొండ, మోహన్‌ దాస్‌, రవికుమార్‌, షాబుద్ధిన్‌ ముల్లా, వెంకటరమణలు విజయం సాధించారు. ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ విజయం సాధించడంతో జర్నలిస్టులు సంబురాలు జరుపుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఇండిపెండెంట్‌ ప్యానల్‌ తరుఫున పోటీచేసి విజయం సాధించడం సంతోషంగా ఉన్నదన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యూనియన్లకతీతంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్‌ వ్యవహరించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - May 06 , 2025 | 11:38 PM