Share News

జిల్లా ఆసుపత్రికి పెరుగుతున్న రోగుల తాకిడి

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:01 PM

మండలంలోని అప్పక్‌పల్లి దగ్గర ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజు రోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది.

జిల్లా ఆసుపత్రికి పెరుగుతున్న రోగుల తాకిడి
జిల్లా ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో, వైద్యులతో పర్యవేక్షిస్తున్న ప్రిన్సిపాల్‌ రాంకిషన్‌

- రవాణా కోసం పల్లెవెలుగు బస్సులను ఆసుపత్రి మీదుగా నడపాలి

నారాయణపేట, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అప్పక్‌పల్లి దగ్గర ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజు రోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. శుక్రవారం 300 మంది వరకు ఓపీ ద్వారా వైద్యసేవలు పొందారు. ఆసుపత్రిలో మహిళల ప్రస వాలు ప్రారంభం కావడంతో పాటు చిన్నారులు, రోగులు నూతన భవనంలో చికిత్సలు పొందుతున్నారు. అయితే అప్పక్‌పల్లి జిల్లా ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిలో అప్పక్‌పల్లి దగ్గర ఉన్న మెడికల్‌ కాలేజీతో పాటు, జిల్లా ఆసుపత్రి ప్రధాన రోడ్డు నుంచి రానుపోను కిలోమీటర్‌ దూరం అవుతుంది. మహబూబ్‌నగర్‌కు రాకపోకలు కొనసాగించే ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు వయా జిల్లా ఆసుపత్రి మీదుగా వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రవాణా ఇబ్బందులపై మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాంకిషన్‌ను ప్రశ్నించగా.. పల్లెవెలుగు బస్సులను అప్పక్‌పల్లి దగ్గర జిల్లా ఆసుపత్రి మీదుగా నడపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ లావణ్యలకు విన్నవించామని, త్వరలో రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:01 PM