Share News

పెరిగిన కూరగాయల ధరలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:40 PM

ఉన్నట్లుండి కూరగాయలు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఎలా కొనాలి? ఏమి తినాలి అంటూ స్థానికులు, కొనుగోలుదారులు అవాక్కయ్యారు.

పెరిగిన కూరగాయల ధరలు
భూత్పూర్‌ సంతలో విక్రయిస్తున్న కూరగాయాలు

- ఏ కూరగాయలైనా కిలో రూ.100 పైమాటే

భూత్పూర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఉన్నట్లుండి కూరగాయలు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఎలా కొనాలి? ఏమి తినాలి అంటూ స్థానికులు, కొనుగోలుదారులు అవాక్కయ్యారు. ఏ కూరగాయలు కొన్నా.. కిలో రూ.80-100 తక్కువ లేదు. మండల కేంద్రంలో ప్రతీ ఆదివారం సంత నిర్వహిస్తారు. ఈ సంతకు ఎక్కువ శాతం మండలంలోని ఆయా గ్రామాల నుంచే కాకుండా అడ్డాకుల, కొత్తకోట, మూసాపేట, ఖిల్లాఘణపూర్‌ మండలాల నుంచి కూరగాయాలు పండించే రైతులు వస్తుంటారు. నేరుగా రైతులే వచ్చి కూరగాయలు విక్రయించడంతో మాములుగా బజార్‌ రేట్ల కంటే తక్కువ ధరకు విక్రయించడంతో జిల్లా కేంద్రం నుంచి కాకుండా దూర ప్రాంతాల వారు ఈ సంతలో కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో కురిసిన తుఫాను కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బతినడంతో కూరగాయలకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. పాలకూర, మెత్తంకూర, తోటకూర రూ.20కి 3-5 కట్టలు విక్రయిస్తున్నారు. కొత్తిమీర, కరివేపాకు ధరలు అమాంతంగా పెరగడంతో కొనుగోలు దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:40 PM