పెంచిన సిలిండర్ ధరలు తగ్గించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:06 PM
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని, పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని కోటకొండ భగత్‌సింగ్ చౌరస్తాలో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.

- సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిరసన
నారాయణపేటరూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని, పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని కోటకొండ భగత్‌సింగ్ చౌరస్తాలో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకురాలు జయలక్ష్మీ, డివిజన్ నాయకులు హాజీ, భీమేష్‌లు మాట్లాడుతూ రూ.400ల ఉన్న సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇస్మాయిల్, కనకప్ప, సుభాష్, వెంకటయ్య, లక్ష్మీ, పద్మమ్మ, సాబీర్, కాశీం, బాలప్ప, కొత్వాల్, యూసుఫ్, ఆఫ్రిద్ ఉన్నారు.