గట్టులో ఎడతెరిపి లేని వర్షం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:45 PM
మండల పరిదిలోని వివిద గ్రామాలలో తుఫాను ప్రభావంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
గట్టు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిదిలోని వివిద గ్రామాలలో తుఫాను ప్రభావంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రైతులు, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోయారు. మొత్తంగా ఏడు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది. కాలనీలు, రోడ్లు జలమ యం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పా రాయి. దీనివల్ల పలురహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లలేకపోయారు. బోయలగుడ్డం నుంచి లింగాపురం వెళ్లే ప్రధాన రహ దారి మధ్యలో ఉన్న రెండు వాగులు పొంగా యి. నీటి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలి చిపోయాయి. ముందుజాగ్రత్తగా ప్రజలను అ టువైపు వెళ్లకుండా పోలీసులు వాగు వద్ద భద్ర త ఏర్పాటు చేశారు. వాగులో నీటి ఉధృతి తగ్గే వరకు ఇటువైపు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా వర్షం కురియడంతో చెరువులకు భారీగా నీళ్లు చేరుతున్నాయి. పలు చెరువులు నీటితో నిండి తూ ములు పారుతున్నాయి. ఈ వర్షంతో చేతికి వ చ్చిన పంటలకు నష్టం చేకూరుతుందని రైతు లు వాపోయారు.