ఆయిల్‌పామ్ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:21 PM
ఆయిల్ పామ్ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.
కొత్తకోట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : ఆయిల్ పామ్ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలో రైతు తిరుపతి తన వ్యవసాయ పొ లంలో పామాయిల్ మొక్కల నాటారు. ఈ సం దర్భంగా ఉద్యన శాఖ అధికారులు రైతులతో స మావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పా ల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెట్ట భూముల కు బోరు మోటారు ద్వారా నీటి సౌకర్యం ఉన్న రైతులు ఏమి ఆలోచించకుండా వాణిజ్య పంట ల్లో అధిక లాభాలు వచ్చే ఆయిల్ పామ్ సాగు పై దృష్టి పెట్టాలన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు చేసుకునే రైతులు వ్యవసాయ అధికారు లను సంప్రందిస్తే రాయితీతో మొక్కలు, డ్రిప్ సిస్టం పైపులు, పరికరాలు, ఎరువులు ఇవ్వను న్నట్లు చెప్పారు. అంతకు ముందు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంతో రూ. 33.5 లక్షలతో నిర్మిస్తున్న ల్యాబ్, లైబ్రరి భవనా లకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, ఎంఈవో కృష్ణయ్య, మనిసిపల్ కమి షనర్ సైద య్య, ఏవో జాస్మిన్, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బోయోజ్, బీచుపల్లి యాదవ్ తదిత రులు పాల్గొన్నారు.