Share News

ప్రకృతి ఒడిలో.. పెళ్లి పందిరి

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:12 PM

నాగర్‌కర్నూ ల్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో సోమశిల కూడా ఒకటి. ఒకవైపు రెండు కొండల నడుమ పరవ ళ్లు తొక్కే కృష్ణానది, మరో వైపు ఆధ్యాత్మిక పరిమళా లు వెదజల్లే లలితాంబికా సోమేశ్వరాలయం పర్యాటకు లను ఆకట్టుకుంటోంది. తాజాగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల కోసం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడంతో సోమ శిల ప్రాంతం కొత్త సొబగులను సంతరించుకోనున్నది.

 ప్రకృతి ఒడిలో.. పెళ్లి పందిరి
కొల్లాపూర్‌ నుంచి నల్లమల అడవి మధ్య సోమశిల గ్రామానికి వెళ్లే రహదారి

- డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు వేదిక కానున్న సోమశిల

- కృష్ణానది తీరాన పెళ్లిళ్లు, శుభకార్యాలకు అవకాశం

- ఆధునిక, విలాసవంతమైన భవనాల నిర్మాణం

- కొత్త అందాలను సంతరించుకోనున్న పర్యాటక కేంద్రం

కొల్లాపూర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూ ల్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో సోమశిల కూడా ఒకటి. ఒకవైపు రెండు కొండల నడుమ పరవ ళ్లు తొక్కే కృష్ణానది, మరో వైపు ఆధ్యాత్మిక పరిమళా లు వెదజల్లే లలితాంబికా సోమేశ్వరాలయం పర్యాటకు లను ఆకట్టుకుంటోంది. తాజాగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల కోసం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడంతో సోమ శిల ప్రాంతం కొత్త సొబగులను సంతరించుకోనున్నది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అందుకు అవసరమయైున అన్ని సదుపాయాలు కల్పించనున్నది. కృష్ణానది తీరా న ఆధునిక, విలాసవంతమైన భవనాలను నిర్మిం చనున్నారు.

అతిథులకు అవసరమైన గెస్ట్‌హౌస్‌లు, సదస్సుల ని ర్వహణ కోసం కాన్ఫరెన్స్‌ హాళ్లు, ఫొటో, వీడియో సెష న్ల కోసం ఉద్యానవనాలు, సెల్ఫీపాయింట్లు, చిన్నారులు ఆడుకునేందుకు అవసరమైన ఉయ్యాలలు, జారుడు బల్లలు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ కేం ద్రాలు జైపూర్‌, రాజస్థాన్‌, ఉదయ్‌పూర్‌, గోవా, ఊటీ, కేరళ తదితర ప్రాంతాల సరసన మన సోమశిల కూ డా చేరబోతున్నది.

రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలు

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యాట క పాలసీ మేరకు వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను గు ర్తించింది. హైదరాబాద్‌ నుంచి రాకపోకలకు సు లువుగా ఉన్న ఆహ్లాదకర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అందులో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్‌, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, బు ద్ధవనం ప్రాజెక్టు, వీటితో పాటు సోమశిల ప్రాం తాల్లో వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ అభివృద్ధి కోసం స్థలాల ను గుర్తించారు. ఈ విషయంపై టూరిజం శాఖ అధికారులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావుతో కలిసి చర్చించినట్లు తెలిసింది.

అందరికీ అందుబాటులో..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్న కుటుంబాలు వివాహ వేడుకలను నిర్వహించుకునేం దుకు రాజస్థాన్‌, జైపూర్‌, ఊటీ, కేరళ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. అందుకోసం కోట్ల రూపా యలు ఖర్చు చేస్తున్నారు. బంధు మిత్రులతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు వ్యయ ప్రయాసలకు గురవు తుంటారు. తాజాగా సోమశిల ప్రాంతాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల కోసం అభివృద్ధి చేయనుండటంతో అందరికీ అందుబాటులోకి రానున్నది. అత్యంత ఆర్భాటంగా పె ళ్లిళ్లు, శుభకార్యాలు, విందులు, వినోదాలు నిర్వహించు కునేందుకు అవకాశం లభించనున్నది. దీంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సభలు, సమావేశాలు, చర్చాగోష్టిలు, వర్క్‌షాపులు నిర్వహించుకునేందుకు వసతులను పర్యాటక శాఖ కల్పించనున్నది.

మరచిపోలేని అనుభూతి

వివాహాలను స్థానిక ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించుకోవ డం సర్వసాధారణం. అలా కాకుండా దూర ప్రాంతాలకు వధూవరులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లి ఆధునిక వసతులు, ప్రకృతి అందాలు, రాజభవనాల్లో వివాహం చేసుకోవడాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటారు. ఇ లా పెళ్లి చేసుకోవడం వారికి మరచిపోలేని అనుభూతిని క లిగిస్తుంది. మనసుకు నచ్చిన ప్రదేశంలో, ఆహ్లాదకర వా తావరణంలో, బంధు మిత్రుల సమక్షంలో నిర్వహించుకునే ఈ వేడుకలు వారికి మరచిపోలేని అనుభూతిని అందిసా ్తయి. ప్రస్తుతం మన దేశంలోని గోవా సముద్ర తీరం, ఊటీ పర్వత ప్రాంతాలు, ఉదయపూర్‌, జైపూర్‌, రాజస్థాన్‌లలోని రాజమహల్‌లలో వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ జరుగుతున్నాయి. త్వ రలోనే ఆ జాబితాల్లో మన సోమశిల కూడా చేరనున్నది.

Updated Date - Jul 03 , 2025 | 11:12 PM