ప్రజాపాలనలో.. సబ్బండ వర్గాల సంక్షేమం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:39 PM
:రాష్ట్రంలో ప్రజాపాలన ఏ ర్పడిన తర్వాత సబ్బండవర్గాలు సంతోషం గా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
- జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రజాపాలన దినోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ప్రజాపాలన ఏ ర్పడిన తర్వాత సబ్బండవర్గాలు సంతోషం గా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఉద్యమాల స్ఫూర్తితో రాబోయే కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధ వారం ప్రజాపాలన దినోత్సవం సందర్భం గా నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. భారతదేశంలో తెలంగాణ లో ప్రధానమైన అస్థిత్వం ఉందని, ఇక్కడి నాగరికత ఎంతో ప్రత్యేకమైనదని ఆయన అన్నారు. దొరలు, భూస్వాములకు వ్యతి రేకంగా పోరాడి తమ హక్కులను సాధిం చుకున్న ఘనత తెలంగాణ ప్రజానీకానిద ని ఆయన తెలిపారు. తెలంగాణ అస్థిత్వ పోరాటాన్ని దారి మళ్లించేందుకు అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 48 గంటల్లోనే మహాల క్ష్మీ, గృహాజ్యోతి పథకాలను అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహాలక్ష్మీ పథకం కింద నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటి వరకు 6కోట్ల 80లక్షల 70వేల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీని కారణంగా దాదాపు 310కోట్ల 43లక్షల రూపాయలు మహిళలు ఆదా చేసుకున్నా రని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో దళారుల ప్రమేయం అధికంగా ఉండేదని డబుల్ బెడ్రూంల పేరిట దాదాపు పదేళ్లు కాలయాపన చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇందిర మ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 586దరఖాస్తులు రాగా అర్హతను బట్టి 11వేల 622ఇళ్లను కేటా యించామని, వీటిలో 6వేల 599ఇళ్లకు మార్కింగ్ వేశామని తెలిపారు. వీటిలో 3వేల 465 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్లో నిర్మా ణం పూర్తి కావచ్చిందన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శం గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని తెలిపారు. ఇందు లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 6వేల మంది రైతుల ఖాతాల్లో 46 కోట్ల 640లక్షల రూపాయలు జమ చేశా మన్నారు. ఉద్యానవన పంటలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం అందిస్తుం దని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు పాల్గొన్నారు.