శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలుచేయాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:30 PM
పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అం శాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల న్యూటౌన్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అం శాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో పం చాయతీ కార్యదర్శుల పాత్ర అ త్యంత ముఖ్యమైందన్నారు. గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే, కార్యదర్శి ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పి వా రి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018 ప్రకారం గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రతీ కార్యక్రమం, ప్ర జలకు అందాల్సిన సేవలు, అభివృ ద్ధి పనులు గ్రామసభల ద్వారానే చర్చించాలని, అవి పారదర్శకంగా జరుగాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హుల వరకు చేరేలా చూడాలని సూచించారు. ప్రజలెవరికైనా ప్రభుత్వ పనులు, పథకాల వివరాలు తెలుసుకునే హక్కు ఉం దని, అందువల్ల పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అం దుబాటులో ఉండాలని సూచించా రు. కార్యక్రమంలో డీపీవో నాగేం ద్రం, మాస్టర్ ట్రైనర్ కృష్ణ, శిక్షణ రీజినల్ మేనేజర్ డాక్టర్ హన్మం తు, కార్యదర్శులు ఉన్నారు.