Share News

ఐకేపీ సెంటర్లలో దోపిడీని అరికట్టాలి

ABN , Publish Date - May 11 , 2025 | 11:20 PM

ఐకేపీ సెంటర్ల లో రైతులను నిలువుదోపిడి చేస్తున్నారని దీనిని అరికట్టాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు అక్కల రమాదేవి డిమాండ్‌ చేశారు.

ఐకేపీ సెంటర్లలో దోపిడీని అరికట్టాలి

- బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు అక్కల రమాదేవి

గద్వాల, మే 11 (ఆంధ్రజ్యోతి) ఐకేపీ సెంటర్ల లో రైతులను నిలువుదోపిడి చేస్తున్నారని దీనిని అరికట్టాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు అక్కల రమాదేవి డిమాండ్‌ చేశారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మండల పరిధిలోని లత్తిపురం, బీరోలు, తుర్కోనిపల్లి గ్రామాలలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను వారు తనికీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మా ట్లాడుతూ తురుగు పేరుతో క్వింటాకు 2.5కేజీల ధాన్యం తీస్తున్నారని దీనివలన రైతు ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నాడని వివరించారు. రైస్‌ మిల్లులు కేంద్రాల నిర్వాహకులను చేతిలో పెట్టుకొని రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరో పించారు. హమాలీ చార్జీలు, పురుకోసకు ప్రభు త్వం డబ్బులు ఇస్తున్నా.. రైతుల నుంచి వసూ లు చేస్తున్నారని ఆరోపించారు. గన్నీబ్యాగులు అందుబాటులో లేవని దీని కారణంగా కొనుగో లు నిలిచిపోతున్నాయని అన్నారు. లారీలు అం దుబాటులో లేకపోవడంతో నిర్వాహకులు కొను గోలు చేయడం లేదని దీనివలన కేందాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని ఆరోపించారు. రైతులు 10నుంచి 15రోజుల వరకు పడిగాపులు కాస్తున్నారని వివరించారు. సివిల్‌ సప్లయ్‌, ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేంద్రాల నిర్వాహణ అస్తవ్యస్తంగా ఉందని వివరించారు. కేంద్రాలలో గత ఏడాది మిల్లులలోని ధాన్యంతో పాటు మార్కె ట్‌లో కొనుగోలు చేసిన ధాన్యంను తీసుకవచ్చి బోనస్‌ను ఎత్తివేసేందుకు భారీగా ధాన్యం వస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆరో పించారు. కర్నాటక బార్డర్‌లోని కేంద్రాలకు కర్ణాటక రాష్ట్రం ధాన్యం వస్తున్నా నిలువరించలేకపోతున్నారి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉం దని ఆరోపించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ దృష్టిపెట్టి రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి స్వప్న, మాజీ మండల అధ్యక్షుడు బాలీశ్వర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేష్‌ గౌడ్‌, రామకృష్ణ, మధురెడ్డి, శేఖర్‌ భద్రి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:20 PM