Share News

నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:02 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్‌ వేసిన అ భ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు.

నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే
శెట్టి ఆత్మకూర్‌ నామినేషన్‌ కేంద్రంలో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు

  • కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ

గద్వాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్‌ వేసిన అ భ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు. శు క్రవారం గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌ గ్రా మ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ సెంటర్‌ను ఆయన తనిఖీచేశారు. దీని పరిధిలో ని సంగాల, గోనుపాడు, మదనపల్లి, ఈడిగోనిప ల్లి గ్రామాల అభ్యర్థులు కూడా నామినేషన్‌ వేస్తుండటంతో వాటి ఓటర్‌ లిస్టులను పరిశీలించారు. నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులు పత్రాలలో వివరాలను సక్రమంగా పూర్తి చేయాలన్నా రు. నామినేషన్‌ వేసే అభ్యర్థుల నుంచి రిటర్నిం గ్‌ అధికారులు ధరఖాస్థులను ఏవిదంగా స్వీకరిస్తున్నారో పరిశీలించారు. నామినేషన్‌ వేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు రిజిష్టర్‌లో న మోదు చేయాలని సూచించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్ప్‌డెస్క్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న వారికి కలెక్టర్‌ సూచనలు చేశారు. ఎన్నికల పరిశీలకులు గంగాధర్‌ పాల్గొన్నారు.

సున్నితమైన గ్రామాలపై దృష్టి : ఎస్పీ

సున్నితమైన గ్రామాలపై దృష్టి పెట్టినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం మండ ల పరిధిలోని పరమాల గ్రామంలో నామినేషన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దన్నారు. సెన్సిటివ్‌ గ్రామాల్లో ప్రత్యేక నిఘా, బందోబస్తు ఉంచామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ నర్సింగరావు నామినేషన్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Updated Date - Nov 28 , 2025 | 11:02 PM