కడుపు నొప్పితో వస్తే కాటికి పంపించారు
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:43 PM
ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి కడుపు నొప్పితో వచ్చిన బాలిక వైద్యం వికటించి మృతి చెందింది.
- వైద్యం వికటించి ఐదేళ్ల బాలిక మృతి
- వైద్యుడి నిర్వాకంతో మృతి చెందిందని బంధువుల ఆందోళన
కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు కాసులకు కక్కుర్తితో ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇటీవల కాలంలో పెబ్బేరు లోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటిం చి మృతి చెందుతున్న సంఘటనలు ప్రజల ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విషయా లను బయటికి పొక్కకుండా ఉండేందుకు మధ్యవర్తుల సమక్షంలో శవాలపై బేరసారా లు ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెబ్బేరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి కడుపు నొప్పితో వచ్చిన బాలిక వైద్యం వికటించి మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం తెల్ల వారుజామున వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకా రం... వీపనగండ్ల మండలం గో వర్ధనగిరి గ్రామంలోని దళిత కాలనీకి చెం దిన రాముడు, శిరీష దంపతులకు సంగీత, రమ్య ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్న కూతు రు రమ్య(5)కు ఆకస్మాతుగా కడుపులో నొప్పి రావడంతో తల్లిదండ్రులు పెబ్బేరు మునిసిపాలిటీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యుడు ఎలాం టి వైద్య పరీక్షలు చేయకుండానే బాలికకు రెండు ఇంజక్షన్లు ఇవ్వడంతో నోట్లోంచి ను రుగును గమనించి వెంటనే ఎక్సరే తీసి మ రో రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అప్పటికి పరి స్థితి విషమించడంతో మహబూబ్ నగర్‌కు తీసుకువెళ్లండని వైద్యుడు పురమాయించి ప్రైవేట్ ఆంబులెన్స్ ద్వారా పంపించాడు. మహబూబ్ నగర్ ఆసుపత్రి వైద్యులు బా లికను పరిశీలించగా అప్పటికే మృతి చెం దిందని వెల్లడించారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యు లు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందో ళన చేపట్టారు.
దళిత బాలిక ప్రాణం ఖరీదు రూ.2లక్షలు
గత మార్చిలో మండలంలోని తిప్పా యిపల్లి గ్రామానికి చెందిన గర్భవతి కడుపు నొప్పితో వచ్చారు. 8నెలల గర్భవతికి గర్భం వైద్య పరీక్షలు చేయకుండానే ఆపరేషన్ చే యాలి, లేదంటే పెద్దప్రాణానికి ప్రమాదమ ని ఆసుపత్రి వైద్యుడు సూచించడంతో కు టుంబ సభ్యులు పూనుకున్నారు. 8 నెలల్లో ఆపరేషన్ చేసి తీసిన శిశువుకి దాదాపుగా 3 గంటల పాటు చికిత్స అందించారు. చివరికి శిశువు పరిస్థితి విషమించడంతో మహబూ బ్ గనర్‌కు తీసుకువెళ్లండని వైద్యుడు ఉ చిత సలహా ఇచ్చారు. దీంతో చేసేది ఏమి లేక కుటుంబ సభ్యులు శిశువుని మహబూ బ్ నగర్‌కు తీసుకువెళ్లిన అక్కడి వైద్యులు రూ.లక్షలు పోసినా శిశువు ప్రాణాన్ని కాపా డలేమని చెప్పారు. హైదరాబాద్‌కు తరలి స్తున్న క్రమంలో మార్గమధ్యలో శిశువు మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మా దృష్టికి రాలేదు..
బాలిక మృతి చెందిన సంఘటన మా దృష్టికి రాలేదు. సోమవారం వైద్య బృదం తో కలిసి ఆసుపత్రిని సందర్శించి పరిశీలి స్తాం. బాలిక మృతిగల కారణాలు, వైద్యు డు అందించిన చికిత్స, మందులు తదితర అంశాలను పరిశీలిస్తాం. వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని తేలితే చట్టపర మైన చర్యలు తీసుకుంటాం.
- అల్లే శ్రీనివాసులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, వనపర్తి