తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తమంటే ఊరుకోం
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:43 PM
తెలంగాణ కోసం కష్టపడ్డం.. జైళ్లకు పోయివచ్చినం.. కన్నకష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తమంటే, నిర్లక్ష్యం చేస్తా మంటే చూస్తూ ఊరుకోమని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, జూలై 23 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ కోసం కష్టపడ్డం.. జైళ్లకు పోయివచ్చినం.. కన్నకష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తమంటే, నిర్లక్ష్యం చేస్తా మంటే చూస్తూ ఊరుకోమని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఏ అభివృద్ధి చేయకం డా మాటలు మాట్లాడతామంటే పడమని చె ప్పారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం సంతోషమని, వచ్చిన అవకాశాన్ని స ద్వినియోగం చేసుకుని జిల్లాకు మంచి చేస్తే పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించా రు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెల ల్లో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చిన టెండర్లనే క్యాన్సల్ చేశారని, 90 శాతం పనులు పూ ర్తి చేశామని మిగతా పది శాతం పనులు పూర్తి చేయాలని డి మాండ్ చేశారు. రెండేళ్లయి నా పనులు చేయడం లేదని, నీళ్లు సము ద్రం పాలవుతున్నాయని, ఉన్న రిజర్వా యర్‌లను నింపుకునే పరిస్థితి లేదన్నారు. కొత్త పనులు అటుంచితే పెండింగ్ పనులు కూడా పూర్తిచేయకపోవడం దురదృష్టకరమ న్నారు. ప్రభుత్వం వచ్చిన ఇప్పటికే రెండేళ్లు కావస్తుందని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఐక్యమత్యంతో వచ్చే ఆరు నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కాలువ పనులన్నీ పూర్తి చేసి ప్రతిచెరువు నింపేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వే షన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేద న్నారు. ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చె బుతుండగా, మరోవైపు ఉపముఖ్యమంత్రి బీసీ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతివ్వాలని ప్రకటన చేశారన్నారు. అసెంబ్లీ నుంచి తీర్మానం చేసిన కేంద్రానికి పంపిన బిల్లులలో రెండున్నాయని, ఒకటి 42 శాతం రిజర్వేషన్లు కాగా, మరోటి వి ద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లు ఉందని, ఇప్పడు రెండో బిల్లు గురించి పట్టించుకోవడం లేదన్నారు. మన్యంకొండ దగ్గ ర రోప్‌వే పనులు ప్రారంభించాలని, బస్టాండ్ ముందు టూరిజం హోటల్ పనులు చేపట్టాల ని, ఒక సంవత్సరం కూడా ఎవరికీ లీజుకు ఇ వ్వలేదని ఫైల్ తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశా రు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, ఎంకన్న, కె.ఆంజనేయులు, సు ధాశ్రీ, శివరాజు, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.