Share News

రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:14 PM

వెను కబడిన కులాల వారిని స్థానికం గా రాజకీయ చైతన్యం తీసుకొ చ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న రి జర్వేషన్లను అడ్డుకునేందుకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌ విమర్శిం చారు.

రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్‌
మాట్లాడుతున్న జహీర్‌ అక్తర్‌

- కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : వెను కబడిన కులాల వారిని స్థానికం గా రాజకీయ చైతన్యం తీసుకొ చ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న రి జర్వేషన్లను అడ్డుకునేందుకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌ విమర్శిం చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వే షన్లు కల్పించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగు తుండగా, రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్‌ అసెం బ్లీలో లోప ఓమాట, బయట మరో మాట మా ట్లాడుతూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నా రని ఆరోపించారు. రిజర్వేషన్లు అడ్డుకుంటే రా ష్ట్రంలో ఈ రెండు పార్టీలకు పుట్టగతులుండవ న్నారు. 1970 నుంచి దేశంలో ముస్లిం రిజర్వే షన్లు ఉన్నాయన్నారు. వైఎస్‌ హయాంలో బీసీ కమిషన్‌ ద్వారా సర్వే చేయిస్తే ముస్లింలలో ఎ స్సీల కన్న వెనుకబడిన వారు ఉన్నారని తేలిం దన్నారు. గుజరాత్‌లో ముస్లింలలో ఉన్న 70 కు లాలను బీసీల్లో చేర్చిన ప్రధాని మోదీ నేడు రిజర్వేషన్ల అంశంపై మాట మార్చడం దురదృ ష్టకరమన్నారు. బెనహర్‌, సత్తూర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, రాములు యాదవ్‌, బాలస్వామి, ఆవేద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:14 PM