Share News

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:17 PM

తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయ ను, గద్వాల అభివృద్ధి కోసం ఎవరి దగ్గర అయిన తలవంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

 ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరైనా పనిచేసేందుకు సిద్ధం : ఎమ్మెల్యే బండ్ల

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయ ను, గద్వాల అభివృద్ధి కోసం ఎవరి దగ్గర అయిన తలవంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వా ల నియోజకవర్గంలోని రహదారుల పునరుద్ధరణకు హామ్‌ అండ్‌ అర్‌ఆండ్‌బీ ద్వారా రూ. 316.45 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో హామ్‌(హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌) ద్వారా గద్వాల నియోజక వర్గంలో పంచాయతీ రోడ్లకు రూ. 154 కోట్ల నిధులు మంజూరు అయ్యావన్నారు. అలాగే గద్వాల నియోజకవర్గంలోని హామ్‌ ద్వారా ఆర్‌ఆండ్‌బీ రోడ్లు కు సంబంధించి రూ.162.45 కోట్లు మంజూరు అయి నట్లు ఆయన తెలిపారు. 3,4 నెలల్లోనే రోడ్డు నిర్మా ణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామ న్నారు. అలాగే గద్వాల నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగా నవంబరు 25న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి నర్సింగ్‌ కళాశాల ప్రారంభిస్తారని, అలాగే రూ.80 కోట్లతో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాని కి భూమి పూజ చేస్తారని తెలిపారు. కొందరు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నారని, వారికి విమర్శలు చేయడం తప్ప ఇంకా ఏమి చేతకాదన్నారు. ఏది ఏమైనా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సమావేశంలో సీనియర్‌ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకట్రాములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్‌గౌడు, విజయ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ బాబర్‌, నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:17 PM