Share News

అమ్మకోసం ఒక మొక్కను నాటాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:27 PM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మకోసం ఒక మొక్క నాటి అమ్మప్రేమలాగే దానిని ప్రేమించి పెద్దది చేయాలని బీజేపీ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు.

అమ్మకోసం ఒక మొక్కను నాటాలి

  • బీజేపీ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి

గద్వాల, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మకోసం ఒక మొక్క నాటి అమ్మప్రేమలాగే దానిని ప్రేమించి పెద్దది చేయాలని బీజేపీ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్‌ 5నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాల ని కోరారు. మంగళవారం అమ్మపేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలో అంబాభవాని ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతీ పౌరుడు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. భవిష్యత్‌ తరాలకు హరితభూమిని అందించేందుకు ఇప్పటి నుంచే మొక్కలు నాటాలని, దానిని పరిరక్షించడం అంతే ముఖ్యమని చెప్పారు.

Updated Date - Jun 24 , 2025 | 11:27 PM