Share News

చదువు కోసం నడవాల్సిందే..

ABN , Publish Date - Jul 17 , 2025 | 10:58 PM

మండలం లోని తుమ్మలచెర్వు విద్యార్థులు చదువు కోసం నడవాల్సిన పరిస్థితి నెలకొంది.

చదువు కోసం నడవాల్సిందే..
ఆలూరు నుంచి నడుచుకుంటూ తుమ్మలచెర్వు గ్రామానికి వెళ్తున్న విద్యార్థులు

- ప్రతీ రోజు ఐదు కిలో మీటర్లు నడుస్తున్న విద్యార్థులు

గట్టు, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : మండలం లోని తుమ్మలచెర్వు విద్యార్థులు చదువు కోసం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 5వ తరగతి వరకే ఉండటంతో పై చదువు కోసం ఆ లూరు ఉన్నత పాఠశాలకు వెళ్లాలి. గ్రామంలోని దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఏకం గా ఐదు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం నుంచి ఉదయం బస్సు సమయానికి వస్తే బస్సుకు వెళ్తారు. లేదంటే కాలి నడక తప్పదు. సాయంత్రం ఎలాంటి బ స్సు సౌకర్యం లేక పోవడంతో అష్టకష్టాలు ప డుతూ భుజాన బ్యాగులు వేసుకుని నిత్యం న డుచుకుంటూ గ్రామానికి చేరుకుంటున్నారు. గురువారం రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న విద్యార్థులను ఆంధ్రజ్యోతి పలరించింది. సా యంత్రం ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాల వదలగానే నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటామని తెలిపారు. వీరితో పా టు నల్లగట్టుతండా, బింగుదొడ్డితండా, వాయిల్‌కుంటతండా, బస్వాపురం గ్రామాల విద్యార్థులు కూడా నిత్యం నడకదారిలోనే ఆలూర్‌కు చేరుకుంటున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 10:58 PM