చాక్‌పీస్‌కూ డబ్బుల్లేవ్!
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:09 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, బోధన సజావు సాగేలా సంస్కరణలు తె స్తున్నా బడుల నిర్వహణకు ప్రభు త్వం నిధులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధులివ్వని ప్రభుత్వం
మూడు నెలలుగా ప్రధానోపాధ్యాయుల ఇబ్బందులు
చాక్‌పీస్‌లు, ఇతర పనులకు జేబులోంచి ఖర్చు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,956 పాఠశాలలు
రావాల్సిన నిధులు రూ.8.18 కోట్లు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, బోధన సజావు సాగేలా సంస్కరణలు తె స్తున్నా బడుల నిర్వహణకు ప్రభు త్వం నిధులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మ డి పాలమూరు జిల్లాలోని పాఠశాలలకు నయా పైసా ఇవ్వలేదు. దాంతో చాక్‌పీస్ నుంచి చిన్న చిన్న పనులు చెయ్యడానికి ప్రఽధానోపాధ్యాయులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది.
నిధుల కోసం హెచ్‌ఎంల ఎదురుచూపు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,956 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. రెం డు లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ప్ర భుత్వం నుంచి రూ.8.18 కోట్ల నిధులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రా లేదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు నిఽధులు కేటాయిస్తారు. ఆ నిధులతో స్టేషనరీ, ప్రయోగశాలల సామగ్రి కొనుగోలు, వివిధ కార్యక్రమాలు నిర్వహణ తదితర బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిఽఽఽధులు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సంగం నిధులైనా మంజూరు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు.
త్వరలో విడుదల
ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణ కోసం నిధులు మంజురు కాలేదు. అందుకోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధులు లేక ప్రఽధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నది వాస్తవమే. నిఽఽధులను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
- దుంకుడు శ్రీనివాస్, ఏఎంవో మహబూబ్‌నగర్