అచ్చంపేటకు గులాబీ జెండాను తెచ్చిందే నేను
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:30 PM
‘‘అచ్చంపేటకు గులాబీ జెండాను తెచ్చిందే నేను’’ అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
- పేదవాడి వాయిస్ వినిపించొద్దని నాపై కుట్ర చేశారు..
- ధర్మం, సామాజిక న్యాయం కోసం పోరాడే కాషాయ జెండాను పట్టాను
- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘అచ్చంపేటకు గులాబీ జెండాను తెచ్చిందే నేను’’ అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా బుధ వారం అచ్చంపేటకు వచ్చిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు అడుగడు గునా స్వాగతం పలికారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆ చారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, సీనియర్ నాయకులు సోలంకి శ్రీను, కట్టా సుధాకర్ రెడ్డి, బల్మూరు జానకిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి గువ్వల బాలరాజు మాట్లాడారు. అచ్చంపేట ప్రాంతంలో గులాబీ జెండా నిలిపింది గువ్వల బాలరాజేనని అన్నారు. ప్రతీ గ్రామంలో నాయకత్వాన్ని తయా రు చేసి రెండు పర్యా యాలు ఎమ్మెల్యేగా గె లుపొందానని అన్నారు. పేదవాడి వాయిస్ విని పించొద్దని గులాబీ పా ర్టీలోనే నాపై కుట్ర జరి గినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందుకే పార్టీని వీడి దేశ రక్షణ కోసం ధర్మం కోసం సామాజిక న్యా యం కోసం పేదల అ భ్యున్నతి కోసం పనిచేసే కాషాయ జెండాను ఎత్తానన్నారు. ఈనెల 28న కేటీఆర్ వస్తున్నారని, అచ్చం పేటకు ఎందుకు వస్తున్నారో నల్లమల ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను ఓడించిన ఘనత వారిదని, కూలాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వారు అబద్ధపు 420 హామీలతో గద్దెనెక్కారని బీజేపీ సీనియర్ నాయకుడు అచారి అన్నారు. గువ్వల బాలరాజును గుండెల్లో పెట్టుకొని చూసుకుం టామన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అచ్చంపేట లో గులాబీ జెండాను ఎగరవేస్తామని అందుకు కార్యకర్తలు సైనికుల్లా కష్టపడాలని పిలుపుని చ్చారు. అదేవిధంగా నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆ ధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజే పీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లతో కాం గ్రెస్, బీజేపీ నాయకుల మధ్య కాస్త ఉధృత పరి స్థితి నెలకొంది. పోలీసులు ఇరువురు నాయకుల ను చెల్లాచెదరం చేశారు. మండల అధ్యక్షురాలు జ్యోతి, బీజేపీ నాయకులు మాంగ్యనాయక్, బాలా జి, గంగిశెట్టి నాగరాజు, పొకలకారు రామోజీ, రే ణయ్య, శంకర్ మాదిగ, పర్వతాలు, మనోహర్, శి వచంద్ర, చందులాల్ చౌహాన్ పాల్గొన్నారు.