Share News

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:01 PM

అదనపు కట్నం కోసం వేధించి, భార్య ఆత్మహ త్యకు కారణమైన భర్తకు 7 సం వత్సరాల జైలు శిక్ష విధిస్తూ జో గుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయాధి కారి ఎన్‌. ప్రేమలత తీర్పు వెల్లడించారు.

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు

- రూ.2,500 జరిమానా

- జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, నవంబరు 3 (ఆంధజ్యోతి) : అదనపు కట్నం కోసం వేధించి, భార్య ఆత్మహ త్యకు కారణమైన భర్తకు 7 సం వత్సరాల జైలు శిక్ష విధిస్తూ జో గుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయాధి కారి ఎన్‌. ప్రేమలత తీర్పు వెల్లడించారు. కే సు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు సోమ వారం వెల్లడించారు. కర్నూలుకు చెందిన మల్లికకు, అలంపూర్‌ మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన చాకలి హరికృష్ణ తో 2022, మార్చి 27న వివాహమైంది. వారి కి ఒక కుమారుడు ఉన్నారు. వివాహం స మయంలో అత్తింటి వారు 10 తులాల బం గారం ఇచ్చారు. అయినా పెళ్లి అయిన మూ డు నెలల నుంచే అద నపు కట్నం కోసం మ ల్లికకు వేధింపులు మొ దలయ్యాయి. 2 తులా ల బంగారం, రూ. 5 ల క్షలు తీసుకొని రావాల ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని మల్లిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో 2023, మే 12న సింగవరం గ్రామంలో పెద్దమనుషుల సమక్షం లో పంచాయితీ పెట్టారు. అప్పుడు మల్లిక ను మంచిగా చూసుకుంటానని అల్లుడు హా మీ ఇవ్వడంతో ఆమెను అక్కడే వదిలి తల్లి దండ్రులు వెళ్లిపోయారు. అదే నెల 20వ తే దీన హరికృష్ణ అత్తగారింటికి వచ్చి, మీ కుమార్తె నిప్పంటించుకున్నదని చెప్పాడు. ఆమె తల్లి జూపల్లి జ్యోతిని బైక్‌పై ఎక్కిం చుకొని సంగవరం గ్రామానికి వెళ్తుండగా, తాండ్రపాడు వద్ద ఎదురొచ్చిన ఆంబులెన్స్‌లో కాలిన గాయాలతో ఉన్న మల్లిక కనిపించింది.

ఆమెతో మాట్లాడగా, ప్రతీ నిత్యం కట్నం కోసం గొడవ పడుతున్నాడని చెప్పింది. నే ను పనినుంచి వచ్చే లోపు నీవు చచ్చిపోవా లని కొట్టాడని, అందుకే ఒంటికి నిప్పంటిం చుకున్నానని చెప్పింది. అనంతరం ఆమెను కర్నూల్‌ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదేరోజు మృతి చెందింది. బాధి త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేశారు.

అప్పటి డీఎస్పీ రంగస్వామి విచారణ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీటు వేశారు. డీఎ స్పీ మొగిలయ్య పర్యవేక్షణలో, అలంపూర్‌ సీఐ రవిబాబు, ఎస్‌ఐ వెంకటస్వామి సాక్షు లను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు హరికృష్ణపై నేరం రుజువైనందున 7 సంవత్సరాల జైలుశిక్ష, రూ. 2500 జరిమానా వి ధిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎన్‌. ప్రేమలత తీర్పు ఇచ్చారు. పకడ్బందీ విచా రణ నిర్వహించి నేరస్థుడికి శిక్ష పడేలా చేసి న అధికారులను ఎస్పీ ప్రత్యేకంగ అభినం దించారు.

Updated Date - Nov 03 , 2025 | 11:01 PM