పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ
ABN , Publish Date - May 30 , 2025 | 11:32 PM
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని బిజ్వార్ అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి స్వామి ఆదిపరాశ్రీ అన్నారు.
- అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి స్వామి ఆదిపరాశ్రీ
ఊట్కూర్, మే 30 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని బిజ్వార్ అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి స్వామి ఆదిపరాశ్రీ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా, ఊట్కూరు మండలంలోని అంబాత్రయ క్షేత్రం ఆవరణలో శుక్రవారం ప్రకృతి ప్రేమికుడు, కృష్ణసాగర్‌తో కలిసి మహాబిల్వపత్రి, ఉసిరి, నేరేడు, రావి తదితర మొక్కలను నాటారు. ఈ సందర్భంగా స్వామి ఆదిపరాశ్రీ మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతింటే భవిష్యత్తులో జీవుల మనుగడ ప్రశార్థకం అవుతుందన్నారు. అందుకోసం అందరూ మొక్కలను నాటి సంరక్షించుకోవాలని కోరారు. కృష్ణసాగర్ పర్యావరణ పరిరక్షణకు 12 సంవత్సరాల నుంచి కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి, నందిమల్ల శ్యాం, ఆశ్విని మణిదీప్, రాఘవేందర్ పాల్గొన్నారు.