Share News

ఓటు ఎలా వేయాలి సారూ?

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:38 PM

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 11న తొలి విడ త పోలింగ్‌ జరుగనున్నది.

ఓటు ఎలా వేయాలి సారూ?
జగత్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

- పోలింగ్‌ కేంద్రాల్లో కనిపించని ప్రత్యేక ఏర్పాట్లు

- దివ్యాంగులు, వయో వృద్ధులకు తప్పని కష్టాలు

- రేపు పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 11న తొలి విడ త పోలింగ్‌ జరుగనున్నది. అభ్యర్థులు ప్రచార హోరులో మునిగితేలుతున్నారు. పోలింగ్‌ నిర్వ హణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో ని మగ్నమైంది. కానీ పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాం గులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. దీంతో వారు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుం ది. తీవ్ర అనారోగ్యం, కేంద్రాల వరకు రాలేని వారు ఓటు హక్కుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో..

రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు ఎన్ని కల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది. 80 ఏళ్లు పైబడిన వృద్దులు, 40 శాతానికి పైగా వికలత్వం ఉన్న దివ్యాంగులు ఓటు వేసేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఫారమ్‌ - 12 డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకే పోలింగ్‌ బృందం వచ్చి ఓటు వేయించింది. పోలింగ్‌ కేంద్రాలను గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడంతో పాటు, ర్యాంపులు నిర్మించింది. వీల్‌ చైర్లు అందుబాటులో ఉంచడమే కాకుం డా సహాయకులను అనుమతించింది. ఉచిత రవాణా వంటి సదుపాయాలను కల్పించింది.

ఈ సారి సదుపాయాలు నిల్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధు లు ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సదుపాయాలు కల్పించలేదు. వారి కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద వీల్‌ చైర్లను మాత్రం అందుబాటులో ఉంచుతోంది. పోలింగ్‌ కేంద్రం వరకు వచ్చే బాధ్యతను మాత్రం ఓటర్లపైనే ఉంచింది. దీంతో వారికి అవస్థలు తప్పేట్లు కనిపించడం లేదు.

అందుబాటులో వీల్‌ చైర్లు

తరుణ్‌ చక్రవర్తి, జిల్లా పంచాయతీ ఆఫీసర్‌ : ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దివ్యాంగులు, వయో వృద్ధుల సౌకర్యార్థం వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచాం. వాటి సహాయంతో వారు కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయొచ్చు. ‘ఓట్‌ ఎట్‌ హోమ్‌’ వంటి సౌక ర్యాలు కల్పించడంపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు ఆదేశాలు అందలేదు.

Updated Date - Dec 09 , 2025 | 11:38 PM