Share News

ఇంకెన్నాళ్లు.. యూరియా కష్టాలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:32 PM

మండలంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు? ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలి? రసాయన ఎరువులకు బదులుగా పచ్చిరొట్ట ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలు గ్రామాల్లో ఉండే ఏఈవోల వద్ద పూర్తి సమాచారం ఉండాలి.

ఇంకెన్నాళ్లు.. యూరియా కష్టాలు
భూత్పూర్‌ సింగిల్‌ కార్యాలయం వద్ద బారులు తీరిన రైతులు (ఫైల్‌)

- అధికారుల లెక్కల ప్రకారం 1400 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం

- ఇప్పటికే 1100 మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ

భూత్పూర్‌, సెప్టెబంరు 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు? ఎరువులు ఎంత మోతాదులో వాడుకోవాలి? రసాయన ఎరువులకు బదులుగా పచ్చిరొట్ట ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలు గ్రామాల్లో ఉండే ఏఈవోల వద్ద పూర్తి సమాచారం ఉండాలి. కానీ వారితో ఎలాంటి సమాచారం లేకపోవడంతో యూరియా కష్టాలు మొదలయ్యాయి. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 16 వేల ఎకరాల్లో వరి పంట సాగైనట్లు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తి 4500 ఎకరాలు, జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు మొత్తం 2500 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలకు 1400 మెట్రిక్‌ టన్నుల యూరియాతో పాటు డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు 800 మెట్రిక్‌ టన్నులు అవసరం. ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు సరిపడా ఉన్నా? యూరియా ఎందుకు ఇంత కొతర అయ్యింది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 1400 మెట్రిక్‌ టన్నుల యూరియా సరిపోతుంది. కాగా ఇప్పటికే దాదాపు 1100 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేశారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మండలంలో యూరియా కొరత ఏర్పడింది. కారణం యూరియా దొరకదని కొంత మంది రైతులు గ్రామాల్లో ఉండే రైతులు (పంట సాగు చేయనివారు) వారి పాసుప్తుకాలు తీసుకొని యూరియా తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇలా జరకగకుండా ఉండాలంటే గ్రామాల్లో ముందుగానే ఏఈవోలు పంటలు వేసిన రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తే 800 నుంచి 1000 మెట్రిక్‌ టన్నుల యూరియా సరిపోతుంది.

Updated Date - Sep 14 , 2025 | 11:32 PM