ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:11 PM
ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు ఈ శిక్షణను సమర్థవంతంగాఉపయోగించుకోవాలని, పనిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మేస్త్రీలకు అవగాహన సమావేశం
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు ఈ శిక్షణను సమర్థవంతంగాఉపయోగించుకోవాలని, పనిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు. మంగళవారం పాతకలెక్టరేట్ సమీపంలో మేస్త్రీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో, ఉత్తమ నాణ్యతతో ఇల్లు నిర్మిచేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నా రు. ప్రతి మేస్త్రీ శిక్షణలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఆరు రోజుల్లో శిక్షణలో పాల్గొనే ప్రతీ మేస్ర్తికి రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ద్వారా కొత్త నిర్మాణ పద్ధతులు, మెరుగైన సామగ్రి వినియోగం, భద్రతా ప్రమాణాలు వంటి కీలక అం శాలపై అవగాహన కల్పించనున్నారని తెలిపా రు. కార్యక్రమంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్, డీఈ నరేందర్, ఏఈ ప్రకాష్, నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అధికారి శివశంకర్, మేస్త్రీలు ఉన్నారు.