యాసంగిపైనే ఆశలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:29 PM
యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాకా లంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడం తో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
- అధిక వర్షాలతో దెబ్బతిన్న వానాకాలం పంటలు
- పడిపోయిన పత్తి ధర, దిగుబడులు
- యాసంగి సాగుపైనే రైతుల ఆశలు
వడ్డేపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాకా లంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడం తో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పత్తిరైతుల పరి స్థితి దారుణంగా ఉంది. గతేడాది పత్తి ధరలు ఆశాజకం ఉండటంతో ఈ ఏడా ది చాలా మంది రైతులు పత్తి సాగు చే శారు. కానీ అధిక వర్షాల కారణంగా పత్తి దిగు బడి తగ్గింది.. ధరలు కూడా పడిపోవడంతో రైతులు అప్పుల నుంచి కోలుకోలేకపోతు న్నారు. యాసంగి పంటలైనా మంచి దిగుబడి వస్తాయ నే ఆశతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు.
1.50 లక్షల ఎకరాల్లో..
దాదాపు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో యాసంగి పంట సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశా రు. కొంత మంది రైతులు సెప్టెంబరు, అక్టోబరులో విత్తనాలు వేశారు. ఇంకా చాలా మంది రైతులు ఈ నెల చివరి నాటికీ సీడ్ జొన్న, పప్పుసెనగ, మొక్క జొన్న పంటలు వేసేందుకు సిద్ధమాయ్యరు.