గౌరవ వేతనం ఒకే విధంగా అందించాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:28 PM
తెలంగాణలో టీజీ ఎన్‌పీడీసీఎల్ స్పాట్ బిల్లింగ్ కార్మికులకు ఇచ్చిన ముఫ్పై రోజుల పనిదినాల ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనా న్ని ఇక్కడ పనిచేస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ స్పాట్ బిల్లింగ్ కార్మికులకు కూడా ఇవ్వాలని స్థానిక యూనియన్ అధ్యక్షుడు కోరారు.
ఎస్‌ఈకి స్పాట్ బిల్లింగ్ కార్మికుల వినతి
గద్వాల అర్బన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో టీజీ ఎన్‌పీడీసీఎల్ (తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) స్పాట్ బిల్లింగ్ కార్మికులకు ఇచ్చిన ముఫ్పై రోజుల పనిదినాల ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనా న్ని ఇక్కడ పనిచేస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ (తెలంగాణ సదరన్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) స్పాట్ బిల్లింగ్ కార్మికులకు కూడా ఇవ్వాలని స్థానిక యూనియన్ అధ్యక్షుడు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేం ద్రంలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా జిల్లా అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ టీజీఎస్‌పీడీసీఎల్ కంపెనీలో సుమారు 1300 కార్మికులు గత ఇరవై సంవత్సరా లుగా కాంట్రాక్ట్ ద్వారా ఫీస్ రేట్ పద్ధతిన స్పాట్ బిల్లింగ్ చేస్తున్నా తమకు కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నా రు. కావున టీజీఎన్‌పీడీసీఎల్ కంపెనీల్లో మా స్పాట్ బిల్లింగ్ కార్మికుల బాధలను అర్థం చేసు కొని ఆగస్టు 6, 2025న సీఎండీ కార్యాలయం నుంచి స్పాట్ బిల్లింగ్ కార్మికులకు సెమిస్కిల్డ్ ఆర్డర్ కాపీని జారీ చేశారన్నారు. కావున ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్‌లో పని చేస్తున్న స్పాట్ బిల్లింగ్ కార్మికులకు కూడా ఒ కేవిధంగా వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్వచ్ఛందంగా విధులను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ప్రాణేష్, శ్రీధర్, ముని, నరసింహ, హరికృష్ణ, శివ, మహేష్‌కుమార్ ఉన్నారు.