హోలీ ఆయారే
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:51 PM
హోలీ ఆయారే అంటూ కేరింతల మధ్య యువతీ యువకులు ఒకరిపై మరొ కరు రంగులను వెదజల్లుకుంటూ హోలీ సంబురాలను శుక్రవారం నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.

- ఘనంగా సంబురాలు
- కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్న యువతీ యువకులు
- పేటలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో వేడుకలు
నారాయణపేట/నారాయణపేట రూరల్/ధన్వాడ/ఊట్కూర్/కోస్గి/నర్వ/మాగనూరు/మరికల్/దామరగిద్ద/కృష్ణ/కొత్తపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ ఆయారే అంటూ కేరింతల మధ్య యువతీ యువకులు ఒకరిపై మరొ కరు రంగులను వెదజల్లుకుంటూ హోలీ సంబురాలను శుక్రవారం నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్నా,పెద్ద తారతమ్య బేధం లేకుండా రంగులను ఒకరిపై ఒకరు వేసుకునేందుకు పోటీ పడ్డారు. నారాయణపేటలో చిన్నారులు, మహిళలు, యువకులు జట్లుగా ఏర్పడి రంగులను చల్లుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా నారాయణపేట చౌక్‌బజార్‌లో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్ట ర్ రాంబాబు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా హోలీ సంబురాలు నిర్వహించారు. బీజేపీ, బజరంగ్‌దళ్, మహిళలు వేడుకల్లో పాల్పంచుకున్నారు. భరతమాత చిత్రపటానికి పూజలు నిర్వ హించిన అనంతరం హోలీ సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌తో పాటు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు హోలీ సంబురాలు జరుపుకున్నారు. బీకేఎస్ ఆధ్వర్యంలో రైతులు హోలీ సంబురాలు జరుపుకున్నారు.
సంబురాల్లో పోలీసు యంత్రాంగం
జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు యంత్రాంగం ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆధ్వర్యంలో తోటి పోలీసులతో కలిసి ఆనందోత్సవాల మధ్య రంగులు చల్లుకొని హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎస్పీ సాయుధ బలగాలతో కలిసి కల్టెకర్ సిక్తా ప ట్నాయక్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్ దంపతులకు రంగులు పూశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు అందించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో జరిగిన హోలీ వేడుకల్లో ఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి పాటలకు స్టెప్పులు వేసి నృత్యాలు చేశారు. అనంతరం బైక్‌పై సిబ్బందితో కలిసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
అదేవిధంగా నారాయణపేట మండల వ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపు కున్నారు. జిల్లాలోని ధన్వాడ, ఊట్కూర్, కోస్గి, నర్వ, మాగనూరు, మరి కల్, దామరగిద్ద, కృష్ణ, కొత్తపల్లి మండల కేంద్రాలతో పాటు, పలు గ్రామాల్లో హోలీ పండుగను యువతీ యువకులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా జరుపుకు న్నారు. గురువారం రాత్రి కామ దహనం చేశారు. చిన్నాపెద్ద రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ కేరింతలతో పండుగను జరుపుకున్నారు.