Share News

సహజ వ్యవసాయంతో అధిక లాభాలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:30 PM

సహజ పద్ధతిలో పంటలను సాగుచేసి అధిక దిగుబడు లు పొందాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్‌ అన్నారు.

సహజ వ్యవసాయంతో అధిక లాభాలు

ఇటిక్యాల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సహజ పద్ధతిలో పంటలను సాగుచేసి అధిక దిగుబడు లు పొందాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్‌ అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం, సాతర్ల గ్రామాల్లో భూసార పరీక్షలు, సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధి కారి సక్రియనాయక్‌ మాట్లాడుతూ భూసార పరీక్షలు చేయించుకోవాలని, మట్టిలో ఉండే పో షకాలను తెలుసుకొని పంటలు సాగు చేసుకున్నట్లైతే అధిక దిగుబడి పొందవచ్చన్నారు. మట్టి పరీక్షల ఆధారంగా సాగు పద్ధతులను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే రైతు భరోసా పథకానికి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మండలంలో వ్యవ సాయ విధానాలపై సంబంధిత ఏఈవోలు, మండల వ్యవసాయశాఖ అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు తగు సలహాలు ఇచ్చి అధిక దిగుబడి పొందేవిధంగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇటిక్యాల మండల వ్యవసాయశాఖ అధికారి రవికుమార్‌, ఆయా గ్రామాల ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:30 PM