మహబూబ్‌నగర్‌లో అధిక వర్షపాతం
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:11 PM
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం లేకుం డా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సమన్వయంతో చర్య లు తీసుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక అధికారి అరవింద్‌కు మార్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం లేకుం డా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సమన్వయంతో చర్య లు తీసుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక అధికారి అరవింద్‌కు మార్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. గురువారం మహబూబ్ నగర్‌లోని సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో కలెక్ట ర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులతో వరదల వల్ల జరిగిన నష్టాలు, నివారణ సహాయక చర్య లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 336.9 మి.మీ. సాధార ణ వర్ష పాతానికి గాను 618.3 మి.మీ. వర్షపాతం నమోదైందని, రాష్ట్రం లో సాధారణ వర్షపాతం కన్నా అత్యధికంగా వర్షపాతం నమోదైన జి ల్లాలో మహబూబ్‌నగర్ రెండో స్థానంలో ఉందన్నారు. 83.5 శాతం అ ధికంగా నమోదైందని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పం చాయతీ, మునిసిపల్ శాఖల సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాల ని అన్నారు. జిల్లాకు కోటి రూపాయలు కేటాయించినట్లు, అత్యవసర పరిస్థితిలో తగిన విధంగా వినియోగించుకోవాలని అన్నారు. ఆర్‌అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు వర్షాల వలన దెబ్బతిన్న కాజ్‌వేలు, రోడ్లు, అంచనా వివరాలు పి.డి.ఎన్. ఏ ఫార్మట్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులకు నిధుల కొరకు ప్రతిపాదనలు పంపాలని సూ చించారు. కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్న ట్లు తెలిపారు. అంతకు ముందు వరదల వలన దెబ్బతిన్న అమరరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టి.జి.ఐ.ఐ.సి, కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్‌రోడ్డును, జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ వెళ్లే వర్షపు నీటితో నిండిన రైల్వే అండర్ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న రహదారి, రైల్వే అం డర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనుల గురించి అధికారులు వివరించారు.