నడకతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:05 PM
ప్రస్తుత సమాజంలో ప్రతీరోజు నడవాలని, నడకతోనే ఆరోగ్యంగా ఉంటారని ఎమ్యెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సమాజంలో ప్రతీరోజు నడవాలని, నడకతోనే ఆరోగ్యంగా ఉంటారని ఎమ్యెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవ్ ద జాయింట్స్ అనే నినాదంతో మారథాన్ అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ నుంచి ఎస్వీఎస్ ఆసుపత్రి వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. ఆర్థరైటిస్ చాలా మందిలో ఉందని, కాని దానిపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు నడవకుండా ఒకేచోట ఉండకుండా ప్రతీరోజు కొద్ది దూరం నడవాలని, నడకతో ఆర్థరైటిస్‌ను దూరం చేసుకోవచ్చని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎస్వీఎస్ యాజమాన్యాన్ని అభినందించారు. ఎస్‌వీఎస్ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ కృష్ణారెడ్డి, ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, డాక్టర్ జయరాంరెడ్డి, ఎస్వీఎస్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జోషి, డాక్టర్ ముకుందం, డాక్టర్ ప్రసన్న పాల్గొన్నారు.