కన్నం వేసింది.. పాత పరిచయస్థుడే
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:12 PM
ఒకప్పుడు అతని వ్యవసా య పొలంలో గాసం చేసిన వ్యక్తే దొంగగా మారాడు.. స్నేహితులతో కలిసి తాళం వేసి న షెటర్ తాళాలు పగలకొట్టి బీరువాలో ఉ న్న రూ.4 లక్షలు కాజేశారు.. వారం రోజుల్లో నే పోలీసులు కేసును ఛేదించిన నిందితు లను కటకటాలకు పంపించారు.
- కోయిలకొండ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
- ఏడుగురి అరెస్ట్.. రూ.3.10 లక్షలు రికవరీ
- గిల్టు నగ అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితులు
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు అతని వ్యవసా య పొలంలో గాసం చేసిన వ్యక్తే దొంగగా మారాడు.. స్నేహితులతో కలిసి తాళం వేసి న షెటర్ తాళాలు పగలకొట్టి బీరువాలో ఉ న్న రూ.4 లక్షలు కాజేశారు.. వారం రోజుల్లో నే పోలీసులు కేసును ఛేదించిన నిందితు లను కటకటాలకు పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం రూ రల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కోయిలకొండ మండల కేంద్రానికి చెంది న అబ్దుల్ అజీజ్ చావుష్ బజవి అనే వ్యక్తి కి కోయిలకొండలో కాంప్లెక్స్ ఉంది. ఇందు లో ఉన్న షెటర్‌లో ఈనెల 11న అర్దరాత్రి దొంగతనం జరిగింది. బీరువాలో ఉన్న రూ.4 లక్షల నగదు, 1.8 కిలోల గిల్ట్ నగను అపహరించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు గురు వారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. ఇదిలా ఉండగా, కోయిలకొండ మండ లం వీరన్నపల్లికి చెందిన వడెన్న ఇదే గ్రా మంలో ఫిర్యాదుదారుడికి చెందిన వ్యవసా య పొలంలో గాసం చేసేవాడు. కొన్నాళ్ల క్రితం పనిమానేసాడు. తరువాత రియల్‌ఎ స్టేట్ వ్యాపారం చేయాలని తిరిగే క్రమంలో ఇతనికి బాలానగర్ మండలం ఎక్వాయ్‌ప ల్లికి చెందిన ముష్ఠి శ్రీనివాసులు, ఏదుల మండలం వాల్యానాయక్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ ముడావత్ సురేశ్, అదే తండా కు చెందిన ఆటో డ్రైవర్ సురేశ్, జడ్చర్ల బాదేపల్లికి చెందిన మనిమరి శేఖర్, గద్వా లకు చెందిన ఉప్పల ఉదయ్‌కుమార్‌లు ప రిచయమై స్నేహితులుగా మారారు. వీళ్లకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జడ్చర్ల లో అందరూ సమావేశమై దొంగతనం చే యాలని నిర్ణయించుకున్నారు. ఏ1 వడెన్న తను ఇదివరకు పనిచేసిన అబ్దుల్ అజీజ్ వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉంటుందని, డ బ్బు షెటర్‌లోని బీరువాలో దాస్తాడని అక్క డ దొంగతనం చేద్దామని చెప్పాడు. ఇందు కు అందరూ కలిసి ఈనెల 11న కోయిల కొండ చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో షెటర్ తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.4 లక్షల నగదు, గిల్ట్ నగ లాంగ్‌చైన్ అ పహరించారు. అయితే గిల్ట్ నగను ఒరిజన ల్ బంగారునగ అని నమ్మించి విక్రయించా లని ప్లాన్ చేశారు. ఇందులో ఏ-2గా ఉన్న ముష్ఠి శ్రీనివాసులు దొంగతనాలలో పాత నేరస్థుడైన తనకు తెలిసిన ఆదిలాబాద్ జి ల్లా నిర్మల్‌లో కార్పెంటర్ అయిన రాజేంద్ర ప్రసాద్‌ను సంప్రదించాడు. అతన్ని ఈనెల 17న జడ్చర్లకు పిలిపించి తమ వద్ద ఉన్న గిల్ట్ నగను చూపించారు. దీన్ని ఒరిజనల్ బంగారుగా విక్రయించాలని అతనికి కొంత డబ్బు ఇచ్చారు. అతను ఇందుకు అంగీకరిం చాడు. గురువారం ఉదయం కోయిలకొండ మండలం వీరన్నపల్లి వడెన్న నివాసంలో అప్పటికే ఖర్చు చేసిన రూ.90 వేలు పోనూ మిగతా సొమ్ములో ఏ-1 నుంచి ఏ-6 వరకు సమానంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పు న పంచుకున్నారు. మిగిలిన రూ.10 వేలే ఏ7కు ఇచ్చారు. అక్కడినుంచి రెండు కార్ల లో బయలుదేరారు. జడ్చర్ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రెండుకార్లలో వచ్చిన నిందితులు అనుమానాస్పదంగా క నిపించడంతో వారిని విచారించగా దొంగత నం విషయం బయటపడింది. నిందితుల్లో ఏ7గా ఉన్న రాజేంద్రప్రసాద్‌పై అక్కడ 5 దొంగతనం కేసులు ఉన్నాయి. నక్సలైట్ అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసిన కే సులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తె లిపారు. నిందితుల వద్ద రూ.3.10 లక్షల న గదు, 1.8 కిలోల గిల్ట్ నగ, రెండు కార్లను సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలిం చారు. కేసు ఛేదించిన కోయిలకొండ ఎస్‌ఐ తిరుపాజి, కానిస్టేబుళ్లు సతీష్, అజార్, శ్రీని వాసులు, ప్రవీణ్‌లను డీఎస్పీ అభినందించా రు. రూరల్ సీఐ గాంధీనాయక్, కోయిలకొం డ ఎస్‌ఐ తిరుపాజి పాల్గొన్నారు.