Share News

విద్వేషాలు, ఉద్రిక్తతలే మోదీ ఆయుధాలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:34 PM

విద్వేషాలు ఉద్రిక్తతలే ప్ర ధాని నరేంద్ర మోదీ ఆయుధాలని, బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.

విద్వేషాలు, ఉద్రిక్తతలే మోదీ ఆయుధాలు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

పాన్‌గల్‌/వనపర్తి టౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : విద్వేషాలు ఉద్రిక్తతలే ప్ర ధాని నరేంద్ర మోదీ ఆయుధాలని, బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నాగ ర్‌కర్నూల్‌ జిల్లా పాన్‌గల్‌ మండల పరిధి లోని రేమద్దుల గ్రామంలో ఆదివారం నిర్వ హించిన శిక్షణ తరగతుల ముగింపు సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ బీజేపీ పాలనపై ప్రజ ల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందన్నారు. పోరా టాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవు తాయని చెప్పారు. కల్తీ విత్తనాలను అరిక ట్టాలని, రైతులకు ఎరువులను సబ్సిడీపై అందించాలని కోరారు. శాంతి చర్చలకు సి ద్ధమని మావోయిస్టులు చెప్పినా వినకుండా కొనసాగిస్తున్న కగార్‌ను వెంటనే నిలిపివే యాలని డిమాండ్‌ చేశారు. ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా పార్టీలను స్థానిక సంస్థ ల ఎన్నికల్లో గెలిపించాలని, అందుకు పార్టీ కార్యకర్తలందరూ సి ద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో సీపీఎం జిల్లా కా ర్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బాల్‌రెడ్డి, వెంకటయ్య, మహబూబ్‌ పాషా, ఆది, నాయకులు వే ణుగోపాల్‌, దేవేందర్‌, వెంకటేశ్‌, రాజేందర్‌ గౌడ్‌, రాము, భగత్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదరికం తీవ్రంగా పెరిగిపోతోంది

సమాజం సంక్షోభాల భారిని పడి పేదరి కం తీవ్రంగా పెరిగిపోతుందని సీపీఎం రా ష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం లో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల పార్టీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతు లు నిర్వహించారు. ఈ సమావేశానికి హాజ రైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో పెట్టుబడిదారి సమాజం సంక్షోభంలో 2008 నుంచి కొనసాగుతుందన్నారు. అనంతరం భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర-సీపీఎం విశిష్టత అనే అంశంపై సీపీఎం జిల్లా కార్య దర్శి పుట్ట ఆంజనేయులు తరగతిని బోధిం చారు. ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కా ర్యదర్శి పరమేశ్వరాచారి, లక్ష్మి, కురుమయ్య, గంధం మదన్‌, గట్టయ్య, బీసన్న, బాల స్వామి, ఉమా, నందిమల్ల రాములు, బాల య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:34 PM